ePaper
More
    HomeజాతీయంLOVE | ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది..!

    LOVE | ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: LOVE | ప్రేమించినవాడు దక్కలేదని ఓ యువతి 11 రాష్ట్రాల్ని వణికించింది. రెనే జోషిల్డా (Rene Joshilda) అనే యువతి చెన్నై(Chennai)లో ఇంజినీరింగ్ (engineering) పూర్తి చేసుకుని, డెలాయిట్‌లో సీనియర్ రోబోటిక్స్ కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. కాగా, బెంగళూరు(Bangalore)లో దివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగిని ప్రేమించింది. కానీ, ప్రేమంటే ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషి ప్రతిపాదనను తిరస్కరించి మరొకరిని వివాహం చేసుకున్నాడు.

    దీంతో ప్రభాకర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రెనే ఓ పెద్ద ప్లాన్ వేసింది. దివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు సృష్టించింది. అనంతరం వాటి ద్వారా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూళ్లు, ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపుల మెయిల్స్ పంపింది.

    ఒక్క అహ్మదాబాద్‌లోనే 21 ప్రదేశాలకు రెనే బెదిరింపు మెయిల్స్ పంపింది. ఈ జాబితాలో తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharashtra), రాజస్థాన్ (Rajasthan), తమిళనాడు (Tamil Nadu), ఢిల్లీ (Delhi), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), బీహార్ (Bihar), పంజాబ్ (Punjab), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), హరియాణా (Haryana) రాష్ట్రాలు ఉన్నాయి.

    జూన్ 12న అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో సైతం రెనే ఓ బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఓసారి తన ఒరిజినల్ ఐపీ నంబరు నుంచి ఫేక్ ఈ-మెయిల్ ఓపెన్ చేయడంతో పోలీసులకు రెనే దొరికిపోయింది. ఐపీ అడ్రస్ ద్వారా రెనే జోషిల్డాను సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...