ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​IAS Amrapali | ఐఏఎస్ ఆమ్రపాలి మళ్లీ వచ్చేస్తోంది..

    IAS Amrapali | ఐఏఎస్ ఆమ్రపాలి మళ్లీ వచ్చేస్తోంది..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Amrapali | ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి (IAS officer Amrapali) క్యాట్‌లో ఊరట లభించింది. ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది.

    ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు (CAT orders) జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన ఆమె.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్‌లో పిటిషన్‌ వేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

    IAS Amrapali | గతంలో కీలక బాధ్యతలు

    కాగా.. ఆమ్రపాలి 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి తెలంగాణకు వచ్చారు. 2023 డిసెంబర్ 14న హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్‌గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది.

    అయితే ఆమెను ఆంధ్రప్రదేశ్​కు కేటాయిస్తూ.. డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్​ చేసింది. దీంతో నాలుగు నెలల క్రితం ఆమె ఏపీలో జాయిన్​ అయ్యారు. తాజాగా క్యాట్​ ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో మళ్లీ తెలంగాణకు రానున్నారు. కాగా.. తిరిగి ఆమెకు కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.

    More like this

    Minister Vakiti Srihari | సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ విధానమే: మంత్రి వాకిటి శ్రీహరి

    అక్షరటుడే,ఆర్మూర్: Minister Vakiti Srihari | ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని పశుసంవర్ధక, క్రీడలు,యువజన...

    Mla Madan Mohan | ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే మదన్​మోహన్​

    అక్షరటుడే,ఎల్లారెడ్డి: Mla Madan Mohan | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) ఎమ్మెల్యే...

    Nizamabad Collector | డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల...