ePaper
More
    HomeజాతీయంAirlines | వారంలో తీరు మార్చుకోకపోతే చర్యలు.. విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక

    Airlines | వారంలో తీరు మార్చుకోకపోతే చర్యలు.. విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Airlines | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) యావత్​ దేశాన్ని కలిచి వేసింది. జూన్​ 12న అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న విమానం టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మృతి చెందారు. విమానం భవనంపై కూలడంతో అందులోని మెడికల్ కాలేజీ విద్యార్థులు సైతం చనిపోయారు. మొత్తం 270 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని (Vijay Rupani) సైతం మరణించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది.

    విమానం ప్రమాదం అనంతరం డీజీసీఏ (DGCA) ఎయిర్​ ఇండియా (Air India)కు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. బోయింగ్​ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని గతంలో ఆదేశించింది. అయితే ఇటీవల పలు విమానాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతేగాకుండా ఏకంగా గాలిలో ఉండగా.. ఇండిగో (Indigo) విమానంలో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో పైలట్​ బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో డీజీసీఏ చర్యలు చేపట్టింది.

    Airlines | లోపాలను సరిచేసుకోవాలి

    విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. విమానాల్లో లోపాలను వెంటనే సరిచేయాలని సూచించింది. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు వారం రోజుల గడువు ఇచ్చింది. వారంలో తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    Latest articles

    Bigg Boss | బిగ్​బాస్ 9లో దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయం.. రాజా వ‌స్తే ర‌చ్చ వేరే లెవ‌ల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bigg Boss | తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ...

    Hyderabad | అధిక వడ్డీ ఆశ చూపి రూ. 20 కోట్లు కాజేశాడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Hyderabad | సులువుగా డబ్బు సంపాదించేందుకు పలువురు మోసాల బాట పడుతున్నారు. మాయమాటలతో ఇతరులను...

    TGSRTC | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ టికెట్ ధ‌ర‌లు త‌గ్గింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TGSRTC | హైదరాబాద్ (Hyderabad) ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్తను ప్రకటించింది. "ట్రావెల్...

    Flood Canal | వరద కాలువకు నీటి విడుదల.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flood Canal | శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​కు ఎగువ నుంచి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది....

    More like this