ePaper
More
    HomeతెలంగాణACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :ACB Trap | రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఎంత మంది అధికారులు ఏసీబీ(ACB)కి పట్టుబడుతున్నా.. లంచాలకు మరిగిన అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా లంచం (Bribe) తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి దొరికాడు.

    నిర్మల్ జిల్లా (Nirmal District) దస్తురాబాద్ మండలం గోడిసేరాల్ గ్రామానికి చెందిన గోసకుల రాజేశం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దాని పర్మిషన్​ కోసం పంచాయతీ కార్యదర్శి మర్రి శివ కృష్ణను కలిశాడు. అనుమతి ఇవ్వడం కార్యదర్శి లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను (ACB officers) ఆశ్రయించాడు. ఈ మేరకు మంగళవారం బాధితుడి నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా.. పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

    ACB Trap | అన్నింటా వసూలు

    పలువురు పంచాయతీ కార్యదర్శులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. డెత్​ సర్టిఫికెట్​ నుంచి మొదలు పెడితే ఇంటి పర్మిషన్ల వరకు ప్రతిదానికి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇవ్వకపోతే పనులు చేయడం లేదు. ఇంటి మ్యూటేషన్​, కొత్త ఇంటి పర్మిషన్​ కోసం అయితే రూ. వేలలో డిమాండ్​ చేస్తున్నారు. బర్త్​, డెత్​ సర్టిఫికెట్ల కోసం రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు.

    ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి

    ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...