అక్షరటుడే, వెబ్‌డెస్క్ :School of Excellence Centers | రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యార్థినులకు(BC Gurukul students) కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థినులకు అవసరమైన షూలు, స్పోర్ట్స్ కిట్లు, నైట్‌డ్రెస్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(BC Welfare Minister Savita) తెలిపారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగిన సందర్భంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
ఈ సమావేశంలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై 36 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ప్రమాదవశాత్తు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అంతేగాక, బీసీ విద్యార్థులకు NEET, IIT వంటి పోటీ పరీక్షల కోచింగ్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో రెండు (School of Excellence) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే (Mahatma Jyotiba Phule) జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
గురుకులాల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు TGT (Trained Graduate Teacher) స్కేల్ వర్తింపజేయనున్నట్టు మంత్రి సవిత తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, ఉపాధ్యాయులకు మంచి వేతనాలతో బీసీ గురుకుల విద్యను ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో విద్యార్థినులకు షూస్, స్పోర్ట్స్ కిట్(Sports kit), నైట్ డ్రెస్(night dresses)లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. గురుకులాల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే వారి కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తామని చెప్పారు. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీ కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం రెండు స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు.