ePaper
More
    Homeక్రైంGadwal | తేజేశ్వర్ హత్యకేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

    Gadwal | తేజేశ్వర్ హత్యకేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadwal | పెళ్లయిన నెలరోజులకే భార్య, ఆమె ప్రియుడి చేతిలో చనిపోయిన తేజేశ్వర్​ హత్య కేసులో (Tejeshwar murder case) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గద్వాలకు చెందిన తేజేశ్వర్​ ప్రైవేట్​ సర్వేయర్​గా పనిచేస్తున్నాడు. ఆయనకు గత నెల 17న ఏపీలోని కర్నూల్​కు (Kurnool) చెందిన ఐశ్వర్యతో వివాహం అయింది. అయితే అంతకు ముందే ఓ బ్యాంక్​ మేనేజర్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమె భర్తను (Husband) హత్య చేయించింది. అయితే ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.

    Gadwal | మొదట భార్యను చంపాలనుకొని..

    కర్నూల్​లోని ఓ బ్యాంక్​లో మేనేజర్​గా (Bank manager) పని చేసే తిరుమల రావుకు గతంలోనే పెళ్లయింది. అయితే ఆయనకు పిల్లలు కాలేదు. ఈ క్రమంలో బ్యాంక్​లో స్వీపర్​గా పనిచేసే ఐశ్వర్య తల్లి సూజాతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఐశ్వర్యకు సైతం దగ్గరై ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం తన భార్యను చంపాలని పథకం పన్నాడు. అయితే ఈ విషయం బయటకు వస్తే తనకు చెడ్డ పేరు వస్తుందని వెనక్కి తగ్గాడు.

    Gadwal | పారిపోయి సహజీవనం చేయాలని ప్లాన్​

    తిరుమలరావు (Tirumala Rao) తేజేశ్వర్​ను చంపడానికి ఐశ్వర్య, సుజాతతో కలిసి పథకం వేశాడు. ఈ మేరకు హత్య కోసం ఓ గ్యాంగ్​కు సుపారీ ఇచ్చాడు. దీంతో పరశురామ్, రాజు, నగేష్ అనే వ్యక్తులు తేజేశ్వర్​ను దారుణంగా హత మార్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని తిరుమలరావుకు నిందితులు చూపించారు. దీంతో వారికి తిరుమలరావు రూ.రెండు లక్షలు చెల్లించాడు. అనంతరం మృతదేహాన్ని కర్నూలు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ (real estate) వెంచర్ లో పూడ్చాలని ప్లాన్ వేశారు. అయితే భయపడి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. హత్య అనంతరం ఐశ్వర్య తిరుమలరావు వేరే రాష్ట్రానికి పారిపోయి సహజీవనం చేయాలని ప్లాన్ వేశారు. అయితే హత్య కేసును ఛేదించిన పోలీసులు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాతను అరెస్ట్​ చేశారు. హత్యకు పాల్పడిన పరశురామ్, రాజు, నగేష్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు తిరుమల రావు ఇంకా పరారీలోనే ఉన్నాడు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...