ePaper
More
    HomeతెలంగాణBonalu Festival | బోనాల పండుగకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి పొన్నం

    Bonalu Festival | బోనాల పండుగకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి పొన్నం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. హైదరాబాద్​ నగరంలో బోనాల పండుగను ప్రజలు అంగరంగ వైభంగా జరుపుకుంటారు. ఈ నెల 26 నుంచి ఆషాఢ మాసం(Ashada Masam) ప్రారంభం కానుంది. దీంతో బోనాల పండుగకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలో బోనాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం హైదరాబాద్​ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)​ బోనాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం(Ujjaini Mahankali Temple)లో మంత్రి సమీక్షించారు.

    Bonalu Festival | రాజకీయాలకు అతీతంగా..

    నగరంలో బోనాల పండుగను(Bonalu Festival) రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు. బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చించారు. చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామన్నారు. ఈ నెల 26న గోల్కొండ బోనాలతో(Golkonda Bonalu) రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం అవుతుంది. గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. తర్వాత జూలై 1 బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma) ఆలయంలో, 13, 14 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, 20న లాల్​ దర్వాజ సింహావాహిని ఆలయం(Lal Darwaja Simha Vahini Temple)లో బోనాలు నిర్వహిస్తారు. ఈ ఆలయాలతో పాటు నగరంలోని పలు ప్రముఖ ఆలయాల్లో సైతం బోనాలు సమర్పిస్తారు.

    Bonalu Festival | పకడ్బందీగా ఏర్పాట్లు

    హైదరాబాద్(Hyderabad)​ నగరంలో బోనాల పండుగ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. ఆలయం లోపల కేబుల్ వైర్‌లు కొత్తవి వేసి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. ఒక్కో వారం ఒక్కో ఏరియాలో పండుగ జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అవసరమైతే రెండు సార్లు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. భద్రత విషయంలో పోలీసులు(Hyderabad Police) జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...