ePaper
More
    HomeతెలంగాణNizamabad | న్యూట్రిషన్​ పౌడర్​ కలిపిన పాలు తాగి ఆస్పత్రి పాలైన మహిళలు

    Nizamabad | న్యూట్రిషన్​ పౌడర్​ కలిపిన పాలు తాగి ఆస్పత్రి పాలైన మహిళలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్​: Nizamabad | హెర్బల్​ ప్రోడక్ట్స్​ విక్రయం పేరిట ఓ వ్యక్తి మహిళలను మోసం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రూరల్​ పోలీస్​(Rural Police) పరిధిలో గల ముబారక్​ నగర్​(Mubarak Nagar)లో జాబ్​ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటన​ వచ్చింది. దీంతో ఇద్దరు మహిళలు మంగళవారం ఉదయం ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

    అక్కడికి వెళ్లాక.. హెర్బల్​ ప్రోడక్ట్స్(Herbal Products)​ విక్రయించాలని నెలకు రూ.15 వేల జీతం ఇస్తామని ఆ వ్యక్తి చెప్పాడు. కస్టమర్లకు ఫోన్​ చేస్తే వారే వచ్చి ప్రోడక్టులు తీసుకు వెళ్తారన్నాడు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూకు వచ్చిన మహిళల్లో ఇద్దరికి బాదం పాలలో వారు విక్రయించాల్సిన న్యూట్రిషన్​ పౌడర్​(Nutrition powder) కలిపి ఇచ్చాడు. ఆ పాలు తాగిన కాసేపటికే సుకన్య, కవిత అనే మహిళలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మహిళల కుటుంబ సభ్యులు వారిని ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital)కి తరలించారు.

    More like this

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ: గొర్ల కాపరితో సహా 20 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...