అక్షరటుడే, వెబ్‌డెస్క్: SSC Results | ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఇటీవల వెలువడ్డ ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC Results) ఇందూరు యువకుడు సత్తా చాటాడు. రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. నిజామాబాద్‌కు చెందిన చాట్ల ఆదిత్య సాయి గుడివాడలోని విశ్వభారతిలో (Vishva Bharati in Gudivada) విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో ఆదిత్యసాయి 594/600 మార్కులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.