More
    Homeలైఫ్​స్టైల్​Fasting | ఉపవాసంతో వెయిట్ లాస్.. బీఎంజే అధ్యయనంలో వెల్లడి

    Fasting | ఉపవాసంతో వెయిట్ లాస్.. బీఎంజే అధ్యయనంలో వెల్లడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fasting | భారతీయ సంస్కృతిలో భాగమైన ఉపవాసానికి (పాస్టింగ్)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తిశ్రద్ధలతో దేవుళ్లను ఆరాధిస్తూ పాటించే ఉపవాసం(Fasting)తో ఎన్నో ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రధానంగా బరువు తగ్గించుకోవచ్చని(Weight Loss) వెల్లడైంది. బరువు తగ్గడానికి సంప్రదాయ ఆహారాల మాదిరిగానే అడపాదడపా ఉపవాసం కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని ఓ అధ్యయనంలో తేలిందని ది బీఎంజై జర్నల్(The BMjoy Journal) పేర్కొంది. రోజు విడిచి రోజు ఉండే ఉపవాస పద్ధతుల వల్ల మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది. అయితే, ఈ ప్రభావాలను నిర్ధారించడానికి దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమని అభిప్రాయపడింది.

    Fasting | 6,500 మందిపై అధ్యయనం..

    ఉబకాయం గురించి ఆందోళనలు పెరుగుతున్న సమయంలో వెలువడిన ఈ అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 బిలియన్ల మంది అధిక బరువుతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా అధ్యయనం జరిగింది. 6,500 కంటే ఎక్కువ మందిపై యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్స్ నుంచి డేటాను సమీక్షించారు. వీరిలో ఎక్కువ మందికి ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు, సగటు BMI 31 ఉన్నాయి. ఈ అధ్యయనాలు మూడు నుంచి 52 వారాల వరకు కొనసాగాయి. వివిధ రకాల ఉపవాస విధానాలను అనుసరించాయి. ప్రతి రెండ్రోజులకు ఒకసారి 24 గంటల ఉపవాసం, వారంలో రెండ్రోజుల ఉపవాసం వంటి విధానాలను అనుసరించి రీసెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలో నిరంతర కేలరీల పరిమితి ఫలితంగా బరువులో తగ్గుదల కనిపించింది. ఉపవాస రకాల్లో రోజు విడిచి రోజు ఉపవాసం వల్ల అత్యంత ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు.

    నిరంతర కేలరీల పరిమితితో పోలిస్తే, రోజు విడిచి రోజు ఉపవాసం ఉండడం వలన సగటున 1.29 కిలోల అదనపు బరువు తగ్గడానికి దారితీసింది. 24 గంటల ఉపవాసం ఉన్న వారిలో 1.69 కిలోలు, వారంలో రెండ్రోజులు పాస్టింగ్ ఉన్న వారిలో 1.05 కిలోల మేర తగ్గదుదల కనిపించింది. అయితే, ఈ తేడాలు 2 కిలోల కనీస పరిమితిని చేరుకోలేదు. ముఖ్యంగా, బరువు తగ్గడం ప్రధానంగా 24 వారాల కంటే తక్కువ కాలం పాటు జరిగిన అధ్యయనాలలో ఇది కనిపించింది. దీర్ఘకాలిక పరీక్షలలో (24 వారాలు లేదా అంతకంటే ఎక్కువ), నిర్మాణాత్మక ఆహారాలను అపరిమిత ఆహారపు అలవాట్లతో పోల్చినప్పుడు మాత్రమే ప్రయోజనాలు స్పష్టంగా కనిపించాయి. అయితే ఇంకా మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక పరిశోధనలు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

    More like this

    Talla Rampur | పోలీసుల పహారాలో తాళ్ల రాంపూర్

    అక్షరటుడే, కమ్మరపల్లి : Talla Rampur | ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్(Talla Rampur)గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....

    Group 1 Rankers | పస్తులుండి పిల్లలను చదివించాం.. వారి భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు : గ్రూప్‌-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group 1 Rankers | రాష్ట్రంలో గ్రూప్​–1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు...

    Local Body Elections | స్థానిక స‌మ‌రం సాగేనా.. ఆగేనా? ద‌గ్గ‌ర‌ప‌డుతున్న గ‌డువు.. తేల‌ని రిజ‌ర్వేష‌న్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లపై సందిగ్ధం కొన‌సాగుతోంది. గ‌డువులోపు ఎన్నిక‌లు...