ePaper
More
    Homeఅంతర్జాతీయంSpace | తెలుగమ్మాయి అరుదైన ఘనత.. అంతరిక్షయానానికి ఎంపికైన తొలి భారతీయ యువతి

    Space | తెలుగమ్మాయి అరుదైన ఘనత.. అంతరిక్షయానానికి ఎంపికైన తొలి భారతీయ యువతి

    Published on

    అక్షరటుడే, అమరావతి: Space : అంతరిక్షయానం అంటే అదో సువర్ణావకాశం. అందరికీ అది సాధ్యమయ్యే పనికాదు..! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది మన తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి(23) (Dhungeti Jahnavi) అంతరిక్షంలో అడుగుపెట్టే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.

    జాహ్నవి అంతరిక్షయానం ఎంపికతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్‌ స్పేస్‌ ఇండస్ర్టీస్‌ (టీఎస్​ఐ) చేపట్టిన టైటాన్‌ స్పేస్‌ మిషన్‌ కోసం వ్యోమగామి అభ్యర్థి (ఏఎస్​సీఏఎన్‌)గా జాహ్నవి ఎంపిక కావడం గమనార్హం.

    ఇప్పటివరకు భారత్‌లో పుట్టి, ఇక్కడే నివసిస్తున్న యువతి.. నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక అయిన సందర్భం లేదు. టైటాన్‌ స్పేస్‌ పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ జాహ్నవి పూర్తిచేసుకుని ఈ స్పేస్‌ మిషన్‌కు అర్హత సాధించింది. కాగా, టైటాన్‌ స్పేస్​ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న యువతిని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

    More like this

    Nizamabad Collector | డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల...

    Collector Nizamabad | ఎంఎంపీటీఎఫ్​ అమలుకు పూర్తి సహకారం

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | వలసదారులు, దుర్భర కుటుంబాల స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాలో అమలు చేస్తున్న...

    Bhupalapally | ఇసుక కోసం వెళ్తే వరద చుట్టుముట్టింది.. వాగులో చిక్కుకున్న ట్రాక్టర్లు, కూలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhupalapally | ఇసుక కోసం వాగులోకి వెళ్లిన వారిని వరద చుట్టు ముట్టింది. ట్రాక్టర్లు,...