ePaper
More
    Homeక్రైంNavipet | లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఇంటర్​ విద్యార్థిని మృతి

    Navipet | లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఇంటర్​ విద్యార్థిని మృతి

    Published on

    అక్షరటుడే, బోధన్​: Navipet | లారీ ఢీకొట్టిన ఘటనలో ఇంటర్​ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బినోల గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్​ నవీపేట్​లో సీడ్స్​షాప్​ నిర్వహిస్తున్నాడు. తన కూతురు తేజస్విని నిజామాబాద్​లోని (Nizamabad ) ఎస్​ఆర్​ కళాశాలలో (SR Inter college) ఫస్ట్​ ఇయర్​లో చేర్పించారు. సోమవారం కళాశాలలో వదిలిపెట్టేందుకు నవీపేట్​ నుంచి గంగాధర్ బైక్​పై కూతురితో బయలుదేరాడు. అయితే నవీపేట్​ మెయిన్​ సెంటర్లో వీరి బైక్​ను వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో​ గంగాధర్​ ఎడమవైపు పడిపోగా.. తేజస్విని కుడివైపుకు పడిపోవడంతో లారీ టైర్లు ఆమె తలపైనుంచి వెళ్లాయి. దీంతో తేజస్విని తలపగిలి సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. కళ్లముందే కూతురు మృతి చెందడంతో గంగాధర్​ అల్లాడిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

    Navipet | ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్​..

    నవీపేట మెయిన్​ సెంటర్లో వాహనాల పార్కింగ్​ ఇష్టారాజ్యంగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు స్పందించి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...