ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Staff Selection Commission | స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్.. ఏకంగా 3,131 పోస్టులు

    Staff Selection Commission | స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్.. ఏకంగా 3,131 పోస్టులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Staff Selection Commission : ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే తరుణమిది. కంబైన్డ్‌ హయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

    ఈ ఉద్యోగాలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు ట్రైబ్యునల్ లో ఉంటాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు వేకెన్సీలు, ముఖ్యమైన తేదీలు ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర వాటి గురించి తెలుసుకుందామా..

    కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (Combined Higher Secondary Level Examination) 2025 నుంచి 31 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 18న దరఖాస్తు గడువు ముగియ‌నుంది. ఆలోగా దరఖాస్తు చేసుకోవచ్చు .ఇందులో వివిధ రకాల పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

    • స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ CHSL 2025 నోటిఫికేషన్ – 3131 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం
    • దరఖాస్తు ప్రారంభ తేదీ: 23.06.2025
    • దరఖాస్తు చివరి తేదీ: 18.07.2025
    • పరీక్ష తేదీలు (టియర్-I): 08.09.2025 నుంచి 18.09.2025
    • టియర్-II పరీక్ష: 2026 ఫిబ్రవరి – మార్చి మధ్యలో

    Staff Selection Commission : ఖాళీల వివరాలు:

    • లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
    • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
    • డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘A’
    • అర్హతలు (01.01.2026 నాటికి):
    • DEO/ DEO గ్రేడ్ A : సైన్స్ స్ట్రీమ్‌లో మ్యాథ్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత
    • LDC/ JSA తోపాటు ఇతర DEO పోస్టులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత
    • వయో పరిమితి (01.01.2026 నాటికి):
    • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
    • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

    (02.01.1999 నుండి 01.01.2008 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు)

    Staff Selection Commission : వయో మినహాయింపు:

    • SC/ST: 5 సంవత్సరాలు
    • OBC: 3 సంవత్సరాలు
    • PwBD (జనరల్/EWS): 10 సంవత్సరాలు
    • PwBD (SC/ST): 15 సంవత్సరాలు
    • PwBD (OBC): 13 సంవత్సరాలు
    • ఎక్స్-సర్వీస్ మన్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం

    Staff Selection Commission : జీతభత్యాలు (పే స్కేల్):

    • LDC/JSA – పే లెవల్ -2: ₹19,900 – ₹63,200
    • DEO –పే లెవల్-4: ₹25,500 – ₹81,100 & Level-5: ₹29,200 – ₹92,300
    • DEO గ్రేడ్ ‘A’ – Pay Level-4: ₹25,500 – ₹81,100

    Staff Selection Commission : ఎంపిక విధానం:

    • టియర్-I (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
    • టియర్-II (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
    • డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)

    Staff Selection Commission : పరీక్ష కేంద్రాలు

    హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, గుంటూరు, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, వ‌రంగ‌ల్, కాకినాడ‌, క‌రీంన‌గ‌ర్, క‌ర్నాలు, విజ‌య‌న‌గ‌రం, నెల్లూరు

    Staff Selection Commission : దరఖాస్తు ఫీజు:

    • మహిళలు/SC/ST/Ex-S/PwBD అభ్యర్థులు – ఫీజు లేదు
    • ఇతర అభ్యర్థులు – ₹100
    • చెల్లింపు విధానం – ఆన్‌లైన్

    Staff Selection Commission : ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:

    అభ్యర్థులు https://ssc.gov.in వెబ్‌సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. నేడు(23.06.2025) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుకు చివరి తేదీ 18.07.2025. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి, అర్హత ప్రమాణాలు సరిచూసుకోవాలి.

    10+2 అర్హత కలిగిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పొందేందుకు అద్భుత అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే తరుణమిది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...