అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy town CI | రాష్ట్రంలో పలువురు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మల్టీ జోన్–1 పరిధిలో ఏడుగురు ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IG Chandrasekhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. నూతన సీఐగా వెయిటింగ్లో ఉన్న బి.నరహరిని నియమించారు. ఆయన గతంలో నిజామాబాద్ నగర సీఐగా పనిచేశారు. కొద్ది నెలలుగా వెయిటింగ్ లో ఆయనకు తాజాగా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు.
కాగా.. చంద్రశేఖర్‌రెడ్డిపై పలు ఆరోపణలు ఉండడంతో బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారితో పాటు పలువురు అధికారులతో సన్నిహితంగా ఉన్న ఈయన ఆ సమయంలో పలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి నుంచి ఈయన బదిలీపై ప్రచారం జరిగింది. దీంతో ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.