ePaper
More
    Homeభక్తిShirdi Sai | షిర్డీసాయి భక్తులకు గుడ్​న్యూస్​.. ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

    Shirdi Sai | షిర్డీసాయి భక్తులకు గుడ్​న్యూస్​.. ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Shirdi Sai | మహారాష్ట్రలో కొలువైన షిర్డీ సాయిబాబా (Shirdi Saibaba)ను నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. తెలంగాణ నుంచి షిర్డీకి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. ప్రస్తుతం షిర్డీకి రద్దీ నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది.

    సికింద్రాబాద్‌ – నాగర్‌సోల్‌ (Secunderabad To Nagarsol) మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జూలై 3 నుంచి 25 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. సికింద్రాబాద్‌ – నాగర్‌ సోల్‌ రైలు జూలై 3 నుంచి ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. నాగర్‌సోల్‌ -సికింద్రాబాద్‌ రైలు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రబాద్​కు చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు.

    ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ముథ్ఖేడ్, నాందేడ్‌, పూర్ణ, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్‌ స్టేషన్లలో ఆగుతుంది. సాయిబాబా భక్తులు ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...