అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kondapur Flyover | హైదరాబాద్ (Hyderabad)లోని గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌కు మాజీ మంత్రి, కార్మిక నేత పారిపాటి జనార్దన్‌రెడ్డి(PJR) పేరు పెట్టారు. ఐటీ కంపెనీలు కొలువై ఉన్న గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గచ్చిబౌలి నుంచి కొండాపూర్ (Gachibowli – Kondapur) వరకు ఫ్లై ఓవర్‌ను నిర్మించింది.
Kondapur Flyover | 28న ప్రారంభం
కొండాపూర్‌లో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి సందర్భంగా ఈ నెల 28న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో అధికారులు ఫ్లై ఓవర్ వద్ద మిగిలిపోయిన పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. ఓఆర్ఆర్ (ORR) నుంచి కొండాపూర్, హాఫీజ్పేట్ మార్గాల్లో వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పి, సమయం ఆదా కానుంది.