ePaper
More
    HomeతెలంగాణCEIR Portal | సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి తిరిగి అప్పగింత

    CEIR Portal | సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి తిరిగి అప్పగింత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:CEIR Portal | నిజామాబాద్​ పోలీస్‌ కమిషనరేట్‌(Police Commissionerate) పరిధిలో సెల్​ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి బాధితులకు తిరిగి అప్పగించారు. బాధితుల ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌(CEIR Portal) ద్వారా రికవరీ చేసినట్లు సీఎస్‌బీ ఏఎస్పీ శ్రీనివాస్‌(CSB ASP Srinivas) తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్‌ డివిజన్‌ పరిధిలో పలువురు వివిధ సందర్భాల్లో సెల్‌ఫోన్లు పోగొట్టుకుని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

    ఎవరైనా సెల్‌ఫోన్లు(Cell Phones) పోగొట్టుకుంటే సీఈఐఆర్‌ పోర్టల్‌(CEIR Portal) ద్వారా ఫోన్‌నంబర్‌ను www.ceir.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో త్వరగా రికవరీకి అవకాశముంటుందన్నారు. ఈ మేరకు సెల్‌ఫోన్ల రికవరీ(Cell Phone Recovery)కి కృషిచేసిన కానిస్టేబుళ్లు అనుష, సుష్మను అభినందించారు. కార్యక్రమంలో పోలీస్​ సిబ్బంది మస్తాన్‌ అలీ, ఐటీ కోర్, ఆర్‌ఎస్సై నిషిత్, సిబ్బంది ఉన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...