అక్షర టుడే, డిచ్‌పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (Telangana Commerce Association) ఆధ్వర్యంలో మంగళవారం ఒక రోజు సెమినార్ నిర్వహించనున్నారు. వికసిత్ భారత్ –2047 ట్రాన్స్‌ఫార్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అంశంపై సదస్సు ఉంటుందని కార్యదర్శి ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి (Professor Rambabu Gopisetty) తెలిపారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మానవ వనరుల నిర్వహణ, అకౌంటింగ్, ఆర్థికం, మార్కెటింగ్, పన్నులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, బిగ్ డేటా, ఆటోమేషన్‌పై పరిశోధన పత్రాలు సమర్పిస్తారని చెప్పారు.
