ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAuto Drivers Rally | 'ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్​ చేయాలి

    Auto Drivers Rally | ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్​ చేయాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​:Auto Drivers Rally | హైదరాబాద్​(Hyderabad)లో వచ్చేనెల 27న నిర్వహించనున్న ‘ఆటో ఆకలి కేకలు’ మహాసభను సక్సెస్​ చేయాలని రాష్ట్ర ఆటో యూనియన్​ జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్(Manda Ravikumar)​ పిలుపునిచ్చారు. నిజాంసాగర్​లో శనివారం ఆటో రథయాత్ర(Auto Rath Yatra) నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల​ 25న మెదక్​లోని నర్సాపూర్​ నుంచి రథయాత్ర ప్రారంభమైందని.. 27న హైదరాబాద్​ చేరుకుంటుందన్నారు. అదేరోజు ఇందిరా పార్క్​లో అమరవీరుల ప్రాంగణం వద్ద మహాసభ ఉంటుందని స్పష్టం చేశారు.

    ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme)తో ఆటోవాలాలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లు(Auto Drivers) ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. మృతిచెందిన ఆటో డ్రైవర్లకు రూ. 25 లక్షలు నష్టపరిహారం(Compensation) ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాయిలు, నిజాంసాగర్ మండల ఆటో యూనియన్ సభ్యులు కైసర్ కుర్షిద్, నర్సింలు, సతీష్, హమీద్, మక్సూద్​, రఫీక్, రజాక్​తో పాటు పలువురు ఆటోడ్రైవర్లు యూనియన్​ సభ్యులు ఉన్నారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...