ePaper
More
    HomeతెలంగాణNizamabad city | కబ్జా స్థలంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

    Nizamabad city | కబ్జా స్థలంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​: Nizamabad city | నగరంలోని ధర్మపురి హిల్స్​లో కబ్జాకు గురైన స్థలంలోని అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. 12వ డివిజన్ పరిధిలోని ధర్మపురి హిల్స్​ (Dharmapuri Hills) కాలనీలో గల మదీనా ఈద్గా సమీపంలో భూమి కబ్జాకు గురైంది. ఈ వ్యవహారంపై ‘అక్షరటుడే’లో ‘దర్జాగా కబ్జా..’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కబ్జాకు గురైన స్థలంలో అక్రమ కట్టాడాలను కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    Nizamabad city | ఆక్రమణల పర్వం

    నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు అడ్డూఅదుపూ లేకుండా పోయిన విషయం తెలిసిందే. పలువురు రియల్టర్లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు ఖరీదైన స్థలాల (Lands Grabbing) కబ్జాకు పాల్పడుతున్నారు. రాత్రికిరాత్రే తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి భూములను కాజేస్తున్నారు. కాగా.. 12వ డివిజన్ పరిధి ధర్మపురి హిల్స్​ (Dharmapuri Hills) కాలనీలోని మదీనా ఈద్గా సమీపంలో ఓ మాజీ కార్పొరేటర్​ దాదాపు 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు. ఇందులో రేకుల షెడ్డుతో నిర్మాణాలు చేపట్టాడు. కొంత ఇతరులకు విక్రయించి, మరికొంత స్థలం తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ కబ్జా వ్యవహారంపై ‘అక్షరటుడే’ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి తాజాగా అక్రమ నిర్మాణాలను తొలగించారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...