ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ధర్మపురి హిల్స్​ను సందర్శించిన కలెక్టర్​

    Collector Nizamabad | ధర్మపురి హిల్స్​ను సందర్శించిన కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని (Dharmapuri Hills Colony) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం సందర్శించారు. గతంలో అసైన్​మెంట్​ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో లబ్ధిదారులే ఉంటున్నారా లేదా.. అని ఆరాతీశారు. లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకుని అవి అధికారికంగా జారీ చేసినవా లేదా.. అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

    Collector Nizamabad | అర్హులను గుర్తించాలి

    ఈ సందర్భంగా కలెక్టర్​ ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంతమందికి ఇప్పటిదాకా ఇళ్ల మంజూరీ లభించిందని వార్డ్​ ఆఫీసర్​ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాల్లో నివాసాలు ఉంటున్న వారిలో అర్హులను గుర్తించి మంజూరు చేయాలని ఆదేశించారు. ఆమోదించిన 26 మంది లబ్దిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ హరూన్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహశీల్దార్ బాలరాజు, నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావు తదితరులున్నారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...