ePaper
More
    Homeక్రీడలుOlympic Day | అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం.. క్రికెట్​కు ఒలింపిక్స్‌లో దక్కిన చోటు.. ఇదొక చారిత్ర‌క...

    Olympic Day | అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం.. క్రికెట్​కు ఒలింపిక్స్‌లో దక్కిన చోటు.. ఇదొక చారిత్ర‌క ఘ‌ట్టం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Olympic Day | దాదాపు 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు మళ్లీ ఒలింపిక్స్‌ (Olymoics)లో చోటు దక్కింది. 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌(Los Angeles)లో జరగబోయే విశ్వ క్రీడల్లో క్రికెట్​ను కూడా నిర్వహించనున్నారు. దీనిపై ఇప్పటికే 2028 ఒలింపిక్స్​కు ఆథిత్యం వహిస్తున్న అగ్రరాజ్యం కసరత్తు స్టార్ట్ చేసింది. టీ20 ఫార్మాట్‌లో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఈ పోటీల్లో(Competitions) ఎన్ని జట్లు పాల్గొనాలనే దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఒలింపిక్స్‌కు ఆతిథ్యం వహిస్తున్న అమెరికాకు మాత్రం డైరెక్ట్‌ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Olympic Day | గ‌ర్వ‌కార‌ణం..

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రతిపాదన ప్రకారం, నిర్దిష్ట కటాఫ్ తేదీ నాటికి ICC T20 ర్యాంకింగ్‌లలో టాప్ 6లో ఉన్న జట్లను ఒలింపిక్స్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల మధ్య ఐక్యతకు ప్రతీకగా ఒలింపిక్‌ డే రన్‌ నిలుస్తుంది. అయితే ఈ రోజు అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ దినోత్స‌వం (International Olympic Day) కాబ‌ట్టి బీసీసీఐ ప్ర‌త్యేక ట్వీట్ వేసింది. ఈ రోజు ఒలింపిక్ డే సందర్భంగా ఒక గొప్ప వార్తని పంచుకుంటున్నాం. క్రికెట్(Cricket) ఇప్పుడు అధికారికంగా ఒలింపిక్ క్రీడల్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఈ క్రీడ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదిక అయిన ఒలింపిక్స్‌లో భాగం కావడం భారతీయులందరికీ గర్వకారణం.

    ఈ సందర్భంగా “Let’s Move” అనే ప్రచారంతో, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన ఆటలో భాగం పంచుకొని, ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించేందుకు ముందడుగు వేయాలని పిలుపు ఇచ్చింది.. నడక కావొచ్చు, పరుగెత్తడం కావొచ్చు లేదంటే ఓ చిన్న క్రికెట్ మ్యాచ్ కావొచ్చు ఐక్య‌త‌గా క‌ద‌లండి. క్రీడలు మనలను కలిపే సాధనం. మనల్ని ఉత్తేజితులుగా మారుస్తుస్తాయి. అందుకే ఈ ఒలింపిక్ డే(Olympic Day), మన దేశాన్ని ఆరోగ్యంగా, ఐక్యంగా తీర్చిదిద్దే దిశగా నడక వేయాలని ఈ ఉద్యమం సూచిస్తోంది. ఇక భవిష్యత్తులో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న కలను కూడా నిజం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఐక్యంగా కదలండి, కలను సాకారం చేయండి. ఎందుకంటే మనమందరం కలిసి ముందుకు వెళ్లిన‌ప్పుడు అనుకున్న‌ది సాధించ‌గ‌లుగుతాం. ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ ఆడ‌డం భారత క్రికెట్ అభిమానులకే కాదు, ప్రపంచంలోని కోట్లాది క్రికెట్ ప్రియులకు ఇది ఆనందదాయకమని పేర్కొంది.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...