అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mohan Babu | తెలుగు సినిమా పరిశ్రమలో మోహన్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీనటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా గొప్ప విజయాలు సాధించి భారీగానే ఆస్తులు కూడబెట్టారు. మోహన్ బాబు(Mohan babu) మంచి వ్యాపారవేత్త కూడా. ఆయనకు అనేక పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. కాగా.. మోహన్‌బాబు నటించిన తాజా చిత్రం కన్నప్ప. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్, అక్షయ్ కుమార్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా షూటింగ్ చాలా భాగం న్యూజిలాండ్‌లోనే జరిగింది. అయితే ఇప్పుడు మోహన్ బాబు అక్కడ కూడా భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Mohan Babu | ఫన్నీ వీడియో..
మోహన్ బాబు న్యూజిలాండ్‌లో (Newzealand) 7వేల ఎకరాలు కొనుగోలు చేశానని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మోహన్ బాబు మాట్లాడుతూ ఈ ఏడు వేల ఎకరాలు మొత్తం మాదేనని, మంచు విష్ణు(Manchu Vishnu) కోసం కొన్నానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ వీడియోను కెమెరాలో బంధిస్తున్న వ్యక్తి ఒకరు ఇదంతా బ్లాక్ మనీ(Black money) అని వాఖ్యానించడం షాకింగ్‌గా మారింది. అతను అలా అనడంతో మోహన్ బాబు వెంటనే ఖండించారు. ఎలాంటి బ్లాక్ మనీ లేదని, అంతా సొంత డబ్బుతోనే కొనుగోలు చేశానని చెప్పారు.
జోక్‌గా చేసిన వీడియోను కూడా ఇంత సీరియస్‌గా తీసుకుని వార్తలు రాస్తుండేసరికి బ్రహ్మాజీ(Brahmaji) స్పందించారు. ‘నేను షేర్ చేసిన ఆ వీడియోలో మేం అంతా ఏదో సరదాగా మాట్లాడుకున్నాం.. ఆ ఏడు వేల ఎకరాలు అని సరదాగా అన్నారు.. కొండలు కూడా కొనేశామని ఫన్నీగా అన్నారు.. మేం అంతా అలా ఏదో సరదాగా ముచ్చట్లు పెట్టుకుని జోకులు వేసుకున్నాం.. కానీ ఇదంతా కూడా నిజం అని కొంత మంది నమ్ముకుంటున్నారు.. అరె బై.. న్యూజిలాండ్‌లో ఏడు వేల ఎకరాలు(Seven thousand acres) కొనడం అంత ఈజీ అనుకుంటున్నారా? అలా అయితే ప్రతీ వీకెండ్ అక్కడికి వెళ్లి షూటింగ్ చేసి వచ్చే వాళ్లం.. జోక్స్‌ని జోక్స్‌లా చూడండి.. హెడ్ లైన్స్ చేయకండి.. ఎవ్వరూ ఏ ల్యాండ్ కొనలేదు.. నాన్ సిటిజన్స్‌లను లాండ్ ఓనర్లు అయ్యేందుకు న్యూజిలాండ్ చట్టాలు ఒప్పుకోవు’ అంటూ ఇలా బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చారు.