ePaper
More
    Homeటెక్నాలజీVivo Y400 Pro | వివో నుంచి స్లిమ్మెస్ట్‌ ఫోన్.. ధర ఎంతంటే..

    Vivo Y400 Pro | వివో నుంచి స్లిమ్మెస్ట్‌ ఫోన్.. ధర ఎంతంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo | చైనా(China)కు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ అయిన వివో(Vivo) మిడ్‌ రేంజ్‌లో స్లిమ్మెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ను టీజ్ చేయడంతో పాటు ఈనెల 27 నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో.. వై 400 ప్రో(Vivo Y400 Pro) 5జీ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ మోడల్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గూగుల్‌ సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫ్రీస్టైల్‌ వైట్‌, ఫెస్ట్‌ గోల్డ్‌, పర్పుల్‌ రంగుల్లో వస్తున్న ఈ ఫోన్‌.. ఈనెల 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌తోపాటు రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ స్పెషఫికేషన్స్ తెలుసుకుందామా..

    Display : 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120 Hz రిఫ్రెష్‌ రేటు, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది.

    ప్రాసెసర్​ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

    ఓఎస్​: ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 15తో వస్తోంది.

    కెమెరా: వెనుకవైపు 50 ఎంపీ కెమెరాతో పాటు 2 ఎంపీ కెమెరా అమర్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 32 ఎంపీ సెన్సార్‌ ఉంది. ఈ కెమెరాలతో 4k వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. ఏఐ ఫొటో ఎన్‌హాన్స్‌, ఏఐ ఎరేజ్‌ 2.0, ఏఐ నోట్ అసిస్ట్‌, ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్‌, ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ఏఐ సూపర్‌ లింక్‌, సర్కిల్ టు స‌ర్స్ విత్ గూగుల్ లాంటి స‌రికొత్త ఏఐ ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది.

    బ్యాటరీ : బ్యాటరీ కెపాసిటీ 5,500 ఎంఏహెచ్‌. ఇది 90w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    వేరియట్స్​: ఈ మోడల్‌ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ + 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 24,999. 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌ ధర రూ. 26,999.

    కార్డ్​ ఆఫర్స్​: ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది. అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డుతో 3 నుంచి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...