ePaper
More
    HomeతెలంగాణGadwal | తెలంగాణ‌లో మేఘాల‌య హనీమూన్ మ‌ర్డ‌ర్ సీన్ రిపీట్.. పెళ్లయిన నెల రోజుల‌కే భ‌ర్తని...

    Gadwal | తెలంగాణ‌లో మేఘాల‌య హనీమూన్ మ‌ర్డ‌ర్ సీన్ రిపీట్.. పెళ్లయిన నెల రోజుల‌కే భ‌ర్తని చంపించిన భార్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadwal | గద్వాల జిల్లాలో మేఘాలయ హనీమూన్​ (Meghalaya honeymoon) మర్డర్​ తరహా ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. ప్రియుడితో (boyfriend) కలిసి భర్తను హత్య చేయించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    Gadwal | పెళ్లికి ముందే జంప్​

    జోగుళాంబ గద్వాల జిల్లాకు (Jogulamba Gadwal district) చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహం నిశ్చయం అయింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు కర్నూలులోని (Kurnool) ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో అక్రమ సంబంధం ఉంది. పెళ్లికి ఐదు రోజుల ముందు ఆమె ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో అతడి దగ్గరకే పారిపోయిందని అంతా అనుకున్నారు. తీరా ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగోచ్చిన ఐశ్వర్య తను ఎటు పారిపోలేదని తేజేశ్వర్​కు (Tejeshwar) చెప్పింది. కట్నం డబ్బుల కోసం స్నేహితురాలి ఇంటికి వెళ్లానని నమ్మించింది. దీంతో తేజేశ్వర్​ ఆమె మాటలు నమ్మి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాడు. దీంతో మే 17న వారి పెళ్లి అయింది.

    Gadwal | ప్రియుడికి 2000 సార్లు ఫోన్​

    పెళ్లి అయిన తర్వాత ఐశ్వర్య (Aishwarya) ప్రియుడితో ఫోన్​లో మాట్లాడడం మొదలు పెట్టింది. తనను పట్టించుకోకుండా భార్య నిత్యం ఫోన్​లో మాట్లాడుతుండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ (Tejeshwar) అదృశ్యమవ్వగా.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.

    తేజేశ్వర్​ కోసం గాలిస్తుండగా ఏపీలోని పాణ్యం పోలీసులకు మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు (family members) ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను విచారించగా.. విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి

    Gadwal | పొలం కొంటామని చెప్పి హత్య

    తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి (bank employee) కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్​ను వారి వెంట పంపినట్లు సమాచారం. పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్​ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో (Gadwal) కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం కారులోనే ఆయనపై కత్తులతో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐశ్వర్య, సుజాతను అదుపులోకి తీసుకున్నారు. సదరు బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...