అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ration Cards | రేషన్ కార్డుల విషయంలో ఏర్పడిన గందరగోళానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department)సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 78,842 రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. రేషన్‌షాపుల్లో ఉచితంగా బియ్యం ఇస్తున్నా.. కొంతమంది తీసుకోవడం లేదు. కనీసం 6 నెలలుగా రేషన్ తీసుకోని వారి లిస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవలే రాష్ట్రానికి పంపింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ జిల్లాల కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించగా, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
Ration Cards | అవి రద్దు…
విచారణలో ఏకంగా 78,842 రేషన్ కార్డులను(Ration Cards ) అనర్హమైనవిగా తేల్చారు. కొందరు లబ్ధిదారులు మరణించినా, వివరాలు అప్డేట్ కాలేదు. మరికొంది ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు. మరికొందరు ఈ-కేవైసీ(e KYC) పూర్తి చేయకుండా ఉన్నారు. దీంతో త్వరలోనే అనర్హుల రేషన్‌కార్డులు తొలగిపోనున్నాయి. రద్దయ్యే రేషన్ కార్డుదారులు ఎక్కువగా హైదరాబాద్
(Hyderabad), రంగారెడ్డి(Ranga Reddy), నల్గొండ(Nalgonda), మేడ్చల్(Medchal) జిల్లాల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం పంపిన జాబితా ఆధారంగా తెలిసింది. కాగా రేషన్ కార్డు లబ్ధిదారుల పారదర్శకతలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఏడాది క్రితమే ఈ-కేవైసీ ప్రక్రియను ప్రారంభించింది.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సమీప రేషన్ దుకాణానికి(Ration Shops) వెళ్లి వేలి ముద్రలు ఇచ్చి ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తేనే లబ్ధిదారుల లెక్క అధికారికంగా ధ్రువీకరించినట్లు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల 91.83 లక్షలకు చేరింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్ల నుంచి 3.10 కోట్లకు పెరిగింది. కాగా, కొత్త డిజిటల్ రేషన్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి, ఇతర అధికారులతో ఐదు లక్షల వరకు డిజిటల్ కార్డులను ఇష్యూ చేసే విధంగా ప్లాన్స్ చేస్తున్నట్టు సమాచారం.