ePaper
More
    HomeతెలంగాణHyderabad | బంధువులతో కూల్​డ్రింక్​ తాగినందుకు వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య

    Hyderabad | బంధువులతో కూల్​డ్రింక్​ తాగినందుకు వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆమె జీవితం అర్ధంతరంగా ముగిసింది. భర్తతో కలిసి నూరేళ్లు ఆనందంగా గడుపుదామని ఆ యువతి కన్న కలలు కల్లలు అయ్యాయి. భర్త వేధింపులు తాళలేక పెళ్లయిన రెండు నెలలకే తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లి హౌసింగ్​బోర్డు(Kukatpally Housing Board)లో చోటు చేసుకుంది.

    ఖమ్మం జిల్లా(Khammam District) కొణిజర్ల మండలం సాలె బంజర గ్రామానికి చెందిన పూజిత(19)కు అదే గ్రామానికి చెందిన జాటోతు శ్రీనివాస్‌తో ఏప్రిల్ 16న పెళ్లి అయింది. శ్రీనివాస్​ కేపీహెచ్‌బీలో నివాసముంటూ ఓ జ్యువెలరీ షోరూంలో సేల్స్‌మెన్‌(Salesman) గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల గ్రామంలో పూజిత తమ బంధువులతో కలిసి కూల్‌డ్రింక్ తాగింది. అయితే వారికి శ్రీనివాస్​ కుటుంబానికి పడదు.

    ఆమె కూల్​డ్రింక్​ తాగడాన్ని వీడియో తీసి శ్రీనివాస్‌ అన్న, అల్లుడు వాట్సాప్​లో పంపారు. అప్పటి నుంచి తమకు పడని వాళ్లతో కూల్‌డ్రింక్ ఎందుకు తాగవని శ్రీనివాస్ పూజితను వేధిస్తున్నాడు. దీంతో పాటు అదనపు కట్నం కోసం కూడా వేధించినట్లు పూజిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక పూజిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబం ఫిర్యాదుతో భర్త శ్రీనివాస్‌తో పాటు అత్తింటివారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...