ePaper
More
    Homeఅంతర్జాతీయంYOGA DAY | ఏమిటీ ఈ బీర్​​ యోగా.. నెటిజన్ల విమ‌ర్శ‌లు

    YOGA DAY | ఏమిటీ ఈ బీర్​​ యోగా.. నెటిజన్ల విమ‌ర్శ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: YOGA DAY : సాధార‌ణంగా యోగా Yoga చేయ‌డం అనేది మ‌న శ‌రీరం ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండ‌టం కోసం చేస్తుంటాం. యోగా చేయడం ద్వారా ఒక వ్యక్తికి శారీరక, మానసిక ప్రయోజనాలన్నీ లభిస్తాయని అంటారు. అంతేకాదు వ్యాధులు కూడా దరిచేరవని అంటారు.

    యోగా ద్వారా చాలా వ్యాధులను నయం చేయవచ్చని వివిధ అధ్యయనాల ద్వారా తేలింది. శిక్షణ పొందిన వ్యక్తి నుంచి నేర్చుకోవడం ద్వారా యోగా జరుగుతుంది. కానీ, చాలా మందికి యోగా చేయడం బోరింగ్‌గా అనిపిస్తుంది.

    అయితే, బీర్ యోగా గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, ఇది విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. బీర్ తాగడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ యోగాను కనిపెట్టారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

    YOGA DAY : ఇదేం యోగా…

    కొంతకాలంగా యోగాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొన్ని దేశాలు బీర్ యోగా beer yoga పేరుతో కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. ఈ కొత్త ట్రెండ్‌పై భారతీయులు మండిపడుతున్నారు. భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

    బీర్ యోగాను బెర్లిన్‌ Berlin కి చెందిన ఇద్దరు యోగా శిక్షకులు ఎమిలీ, జూలా 2016 లో ప్రారంభించారట. దీనిని జనం ఇష్టపడటం మొదలు పెట్టారట. అలా మొదలైన బీర్ యోగా జర్మనీ Germany నుంచి ఇతర దేశాలకు వేగంగా పాకింది. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల నుంచి థాయ్ లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంది.

    యోగా చేయాలంటే మనసు ఏకాగ్రతతో ఉండాలి. బీర్ యోగాకి సంబంధించిన నియమాలు పూర్తి విభిన్నంగా ఉంటాయి. కొత్తగా యోగా ప్రారంభించేవారు.. మైండ్ కంట్రోల్‌లో పెట్టుకోలేని వారు బీర్ యోగా చేయడానికి ఆసక్తి చూపుతారట. రెండు గ్లాసుల బీరు గొంతులోకి పోసుకుని యోగాసనాలు వేస్తారు.

    ఇలా చేయడం వల్ల శరీరం Body వేడెక్కడం..కండరాలు వదులుగా మారడం.. ఒత్తిడి తగ్గడం వంటి అనుభూతికి లోనవుతారట. ముఖ్యంగా బీరు వ్యసనపరులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఈ రకంగా యోగా చేస్తారని తెలుస్తోంది. జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌ద‌రు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...