అక్షరటుడే, ఇందూరు:Farmer MLA Bigala | కేసీఆర్(KCR) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం(Party Office)లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందుల్లేవన్నారు. అన్నివర్గాల ప్రజలకు స్వర్ణయుగం ఉండేదని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతుబంధు పూర్తిస్థాయిలో అందాయని పేర్కొన్నారు.
మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration)కు అర్బన్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ నుంచి వాహనం బయలుదేరుతుందని, కార్యకర్తలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ నీతూ కిరణ్, జడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్, మాజీ కార్పొరేటర్లు, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.