ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YS Sharmila | జగన్​ది రాక్షసానందం.. షర్మిళ సంచలన వ్యాఖ్యలు

    YS Sharmila | జగన్​ది రాక్షసానందం.. షర్మిళ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Sharmila | గ‌త కొద్ది రోజులుగా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌(Jagan)ను టార్గెట్ చేస్తూ ష‌ర్మిళ (YS Sharmila) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్ల (Rentapalla) పర్యటన వెళ్లే క్రమంలో జ‌గ‌న్‌ కారు కింద వృద్ధుడు సింగయ్య పడిన దృశ్యాల తాలుకు వీడియోలు వైరల్ అయ్యాయి.

    ఈ నేపథ్యంలో ఆదివారం అమరావతి (Amaravati)లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని అన్నారు. ఈ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని తెలిపారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి సైతం లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి అంటూ వైఎస్ జగన్‌ను ష‌ర్మిళ‌ ప్రశ్నించారు.

    YS Sharmila | ఇదేం రాజకీయం

    వంద మందికి పర్మిషన్(Permission) ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి వైఎస్ జగన్ చేతులూపడం ఏమిటంటూ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా భారీగా వాహనాలతో ర్యాలీ చేస్తుంటే ఎందుకు వదిలేశారంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను సైతం ప్రశ్నించారు. ఈ ఘటనకు ఇద్దరూ బాధ్యులేనని ఆమె తేల్చేశారు. బెట్టింగ్​లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఒక వ్యక్తిని బలి ఇస్తారా అని అడిగారు. ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? అని జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

    YS Sharmila | ఉనికి కోసం ప్రాణాలు తీస్తారా!

    ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? అంటూ వైఎస్ జగన్‌ను ఆమె నిలదీశారు. ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా అన్నారు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ బాధ్యతరాహిత్యానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. బలప్రదర్శన చేసి సింగయ్య మృతి (Singayya Death)కి కారణమైన జగన్‌తోపాటు వంద మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉందని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. తమ పార్టీ చేసే దీక్షలను భగ్నం చేస్తారని.. ఆ క్రమంలో ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...