అక్షరటుడే, బాన్సువాడ: Banswada | షార్ట్ సర్క్యూట్ కారణంగా షూ షోరూం (Shoe showroom) దగ్ధమైంది. ఈ ఘటన పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాటా షోరూంలో (Bata Showroom) ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో పక్కనే ఉన్న దుకాణాదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్‌స్టేషన్ (Fire station) సిబ్బంది ఫైరింజన్‌తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.