Balayya Movie
Balayya Movie | దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌పై బాల‌య్య సినిమా.. టైటిల్ చాలా వెరైటీగా ఉందే..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Balayya Movie | హైదరాబాద్ నగరంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basavatarakam Cancer Hospital) గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నగరంలో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ ఎంతో మందికి ప్రాణదానం చేస్తుంది. ఈ ఆస్పత్రి స్థాపించి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రి 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ (Actor Balakrishna) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ (BalaKrishna)తో పాటుగా.. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ (Governor Jishnu Dev Verma), రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. అయితే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (Deputy CM Damodar Rajanarsimha) పేరుతో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే (Hindupuram MLA), బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్​ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.

Balayya Movie | వెరైటీ టైటిల్..

అయితే ఆ చిత్రానికి దామోదర రాజనర్సింహా టైటిల్ కాకుండా దబిడి దిబిడి రాజనర్సింహ (Dabidi Dabidi Raja Narasimha) అని టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి 25ఏళ్లు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిని డబ్బులు, లాభాల కోసం ఏర్పాటు చేసింది కాదన్నారు. వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి పుట్టిందని తెలిపారు. తన తల్లి క్యాన్సర్‌తో చనిపోయిందని.. దీంతో అందరికి క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతో తన తండ్రి ఎన్టీఆర్ NTR ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని వివరించారు. 110 బెడ్స్‌తో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నేడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ పరికరాలతో దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే తమకు పూర్తి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభూత్వానికి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఈ సందర్భంగా ఆస్పత్రికి ఛైర్మన్ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Balayya Movie | 100 పడకలతో ప్రారంభమై..

ప్రారంభంలో ఈ ఆస్పత్రి కేవలం 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందని బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే వెయ్యి పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. తమకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తోన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, సీఎంలకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.