అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay devarakonda | విజయ్ దేవరకొండ ఒక్కోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో వివాదాలలో చిక్కుకుంటారు. ఇటీవల సూర్య నటించిన రెట్రో మూవీ (Retro movie) ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అందులో ఆయన షెడ్యూల్ తెగకి సంబంధించి ఉపయోగించే ‘ట్రైబల్'(tribal) అనే మాట మాట్లాడటం జరిగింది. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో విజయ్ గిరిజనులను అవమానించేలా మాట్లాడడం దారుణమని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(Atrocity case) నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Vijay devarakonda | కేసు నమోదు..
500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్లు పాకిస్తాన్(Pakistan) వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటూ వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండను చిక్కుల్లో పడేశాయి. తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద విజయ్ దేవరకొండపై (Vijay devarakonda) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గిరిజన సంఘాల ఆందోళనతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ శ్రీధర్(ACP Sridhar) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈ వివాదంపై విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ట్వీట్ చేస్తూ షెడ్యూల్డ్ తెగల వారిని ఎంతో గౌరవిస్తూ, వారిని దేశంలో అంతర్భాగంగా భావిస్తాను. వారిని బాధపెట్టే లేదా లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు.
దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చే సమయంలో, తన సోదరుల్లా భావించే భారతీయులలో ఏ ఒక్క వర్గాన్ని కూడా తాను ఉద్దేశపూర్వకంగా ఎలా వేరు చేస్తాను. నేను ఉపయోగించిన “ట్రైబ్” అనే పదం శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలు, కుటుంబాలుగా ఏర్పడి, తరచుగా సంఘర్షణలు పడే కాలాన్ని సూచించే ఉద్దేశంతోనే ఉపయోగించాను. వలస వచ్చిన లేదా స్వాతంత్య్రానంతర భారతదేశంలో 100 సంవత్సరాల క్రితమే అధికారికంగా ఏర్పడిన షెడ్యూల్డ్ తెగల వర్గీకరణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాదు. ఆంగ్ల డిక్షనరీ ప్రకారం ట్రైబల్ అంటే సామాజిక, ఆర్థిక, మతపరమైన లేదా రక్త సంబంధాలతో ముడిపడి, ఉమ్మడి సంస్కృతి మరియు మాండలికం కలిగిన కుటుంబాలు లేదా సమాజాల సమూహం. ఇది సాంప్రదాయ సమాజంలో ఒక సామాజిక విభాగం. నా సందేశంలో ఏదైనా భాగం అపార్థం చేసుకున్నా లేదా ఎవరినైనా బాధించి ఉన్నా, క్షమాపణలు (Sorry) తెలుపుతున్నానని విజయ్ దేవరకొండ ట్వీట్లో తెలిపాడు.