అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | కాకతీయ జూనియర్ కళాశాల (Kakatiya Junior College) 2002-04 సీఈసీ బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. అయితే తమ సమ్మేళనం కలకాలం గుర్తుండేలా వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఆదివారం తాము నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో (Alumni Association) ఎక్కడా కూడా ప్లాస్టిక్ వినియోగించలేదు.
మోదుగాకులతో తయారుచేసిన ప్లేట్స్, జొన్న వ్యర్ధాలతో తయారు చేసిన గ్లాసులను వాడారు. అలాగే బ్యానర్ ఫ్లెక్సీతో కాకుండా క్లాత్‌ను వాడి పర్యావరణానికి (Environment) హాని కలిగించకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. తమకు పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా ఆదర్శంగా నిలిచారు.