అక్షరటుడే, బాన్సువాడ: Mala Sangham | రాష్ట్రంలో మాల కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని బాన్సువాడ (Banswada) మాల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో (Hyderabad) కార్మిక, ఉపాధి, భూగర్భ గనుల మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామికి (Minister Vivek Venkata Swamy) వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యల సంతోష్, బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం సాయన్న, బోగాడమిది సాయిలు, సురేష్, పాండు, గంగాధర్, కోటగిరి మండల మాల సంఘం అధ్యక్షుడు భూమేష్, రాములు, పూప్పల సైదయ్య, పొతoగల్ మండల అధ్యక్షుడు జ్యోతిపాల్, గంగాధర్ పాల్గొన్నారు.