ePaper
More
    HomeసినిమాThandel Movie | చైతూ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. టీవీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన తండేల్

    Thandel Movie | చైతూ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. టీవీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన తండేల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Thandel Movie | యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌(Naga Chaitanya), అందాల హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) ప్ర‌ధాన పాత్ర‌ల‌లో చందూ మొండేటి తెర‌కెక్కించిన చిత్రం తండేల్‌(Tandel). భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం విజ‌యం సాధించింది. మొదటి రోజే అద్భుత స్పందన సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత పెద్ద సంఖ్యలో థియేటర్లకు చేరుకొని తండేల్ ఎంజాయ్ చేశారు. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది తండేల్. దీంతో నాగచైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా తండేల్ నిలిచింది.

    Thandel Movie | ఇప్పుడు టీవీలో..

    నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లైన‌ అన్ని ప్రాంతాలలో మొద‌టిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో న‌డిచి రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ మైలురాయిని సైతం దాటి చైత‌న్య‌కు మెమ‌ర‌బుల్ హిట్‌ను అందించి త‌న కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. చైతూ, సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌తో పాటు దేవీశ్రీ ప్ర‌సాద్ (DEVI SRI PRASAD) సంగీతం, పాట‌లు ఒక‌దానితో ఒక‌టి సెట్ అయి ఈ యేడు భారీ విజ‌యం సాధించిన చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. ఆపై నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓటీటీలో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సైతం వ‌చ్చిన ఈ సినిమా ఆడియ‌న్స్ నుంచి మంచి ఆద‌ర‌ణనే ద‌క్కించుకుని మూడు నాలుగు వారాల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది.

    అయితే ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. అయితే ఈ చిత్రం శాటిలైట్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు జీ తెలుగు(Zee Telugu) ద‌క్కించుకోకున్న విష‌యం తెలిసిందే. జూన్ 29న, 2025న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ మేర‌కు స‌ద‌రు సంస్థ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో మ‌రోమారు చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట రెండు తెలుగు రాష్ట్రాల టీవీ ఛాన‌ళ్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇంటి ప‌ట్టున ఉండే వారికి వ‌చ్చే ఆదివారం మంచి అదిరిపోయే ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంద‌నుంది.. ఇక చైతూ విష‌యానికి వ‌స్తే తండేల్ స‌క్సెస్​తో ఫుల్ జోష్​లో ఉన్న చైత‌న్య త‌న త‌ర్వాతి సినిమాను కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైతూ కెరీర్లో 24(NC24)వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోంది. మీనాక్షి చౌద‌రి(meenakshi chaudhary) హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు వృష క‌ర్మ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...