ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Chemist and Druggist Association | మెడికల్​ షాపుల్లో ధర్మబద్ధంగా వ్యాపారం జరగాలి

    Chemist and Druggist Association | మెడికల్​ షాపుల్లో ధర్మబద్ధంగా వ్యాపారం జరగాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chemist and Druggist Association | మెడికల్ షాపుల్లో ధర్మబద్ధంగా వ్యాపారం జరగాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మున్నూరుకాపు సంఘం (Munnurukapu sangham) జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా​ మాట్లాడుతూ నకిలీ మందులు అమ్మి కోర్టుల చుట్టూ తిరుగవద్దన్నారు. అధిక డిస్కౌంట్లకు (higher discounts) ఆశపడి ఇతర రాష్ట్రాల నుంచి మందులను కొనవద్దని సూచించారు.

    కొన్నిరకాల మందులను నేరుగా సూపర్ మార్కెట్లు (Super markets), కిరణా షాప్​లలో అమ్మేందుకు అనుమతి ఇవ్వడం వల్ల మెడికల్​ వ్యాపారులకు నష్టం వస్తోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి రాజు, రాష్ట్ర నాయకులు వెంకటి, అరవింద్, నర్సయ్య, చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి నల్ల మధుసూదన్, కొండ సత్య ప్రసాద్, ప్రధాన కార్యదర్శి స్థానానికి బీర్కూరు సుధాకర్, మైసాల సంతోష్, కోశాధికారి స్థానానికి మోర సాయిలు, కె.రమేష్ పోటీ పడుతున్నారు.

    More like this

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...