అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలుకింద పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు (Railway Police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సాయినగర్ (Sainagar) ప్రాంతానికి చెందిన రాజారపు శ్రీనివాస్ బీటెక్ పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ పాసయ్యానని ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే శ్రీనివాస్ ఫెయిల్ అయ్యాడని కుటుంబీకులకు తెలియడంతో వారు నిలదీశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ రైలు కిందపడి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.