అక్షరటుడే, వెబ్డెస్క్: Big Boss 9 | తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ 9 (Bigg Boss Season 9) కోసం సన్నద్ధమవుతోంది. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ షోకోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సరికొత్త హంగులు, కంటెస్టెంట్లతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 (Big boss 9) మొదలు కానుంది. దాదాపు మూడు నెలల పాటు జరిగే ఈ రియాలిటీ గేమ్ షో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Big Boss 9 | వీళ్లే కంటెస్టెంట్స్..
గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, ఫేమస్ యూట్యూబర్లు (YouTubers), సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు (Social media influencers) హౌస్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. ఇక ఎంటర్ టైన్మెంట్ అందించే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎంపిక కోసం బిగ్ బాస్ యాజమాన్యం గట్టిగానే కసరత్తు చేస్తోందట. తాజా సమాచారం ప్రకారం.. నటి తేజస్విని, బిగ్ బాస్ 8వ సీజన్ విన్నర్ నిఖిల్ మాజీ ప్రేయసి సీరియల్ నటి కావ్యలను ఈసారి హౌస్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అలాగే మరో క్రేజీ ఆర్టిస్ట్ పేరు నవ్యసామి పేరు తెరపైకి వచ్చింది. వీరే కాకుండా ఛత్రపతి శేఖర్. బుల్లితెర యాక్టర్ ముఖేష్ గౌడ, గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్, సీనియర్ నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్(RJ Raj) పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన బమ్ చిక్ బబ్లూ (Bum Chick Babloo)ను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. అలాగే జబర్దస్త్(Jabardast) కామెడియన్ ఇమ్మాన్యుయేల్, సీరియల్ నటి డెబ్జానీ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్న కొందరు ఆర్టిస్టులు సైతం ఎంట్రీ ఇవ్వనున్నారట. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కానున్నట్లు టాక్.