ePaper
More
    HomeFeaturesTraffic Challan | వామ్మో ఆ స్కూటీపై అన్ని వందల చలాన్లా.. షాకైన పోలీసులు

    Traffic Challan | వామ్మో ఆ స్కూటీపై అన్ని వందల చలాన్లా.. షాకైన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Challan | రోడ్డు ప్రమాదాల నివారణకు అమలు చేసే ట్రాఫిక్​ నిబంధనలను అనేక మంది ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్​ నిబంధనలు (Traffic Rules) పాటించని వాహనదారులకు పోలీసులు జరిమానాలు వేస్తున్నా కొందరు మారడం లేదు. హెల్మెట్​ పెట్టుకోకుండానే బైక్​లపై రయ్యున దూసుకెళ్తున్నాఉ. సెల్​ఫోన్​ మాట్లాడుతూ బైక్​ నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వీరికి పోలీసులు జరిమానాలు వేస్తున్నారు. అయితే ఇలాగే ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వాహనదారుడిని పట్టుకున్న పోలీసులు బండిపై ఉన్న చలాన్లు చూసి షాక్ అయ్యారు. సదరు వ్యక్తి స్కూటీపై ఏకంగా 233 చలాన్లు ఉండడం చూసి అవాక్కయ్యారు.

    వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ(Hanmakonda) జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్​ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ స్కూటీ(ఏపీ12 జీ8379)ని ఆపి బండిపై ఉన్న చలాన్లు చెక్​ చేశారు. ఆయన స్కూటీపై 233 చలాన్లు ఉండడం చూసి ట్రాఫిక్​ పోలీసులు (Traffic Police) షాక్​ అయ్యారు. ఆ మొత్తం జరిమానాల విలువ రూ.45,350 కావడం గమనార్హం. సదరు బండిపై 2016 నుంచి చలాన్లు పెండింగ్​లో ఉన్నాయి. అందులో 90శాతం హెల్మెట్​ ధరించకపోవడంతో వేసినవి కావడం గమనార్హం. దీంతో బైక్​ను సీజ్​ చేసిన పోలీసులు ఫైన్​ కట్టి తీసుకువెళ్లాలని సూచించారు.

    కాగా.. స్కూటీ యజమాని అస్లా మాట్లాడుతూ.. ఏడాది క్రితం తాను కరీంనగర్‌కు చెందిన వ్యక్తి నుంచి వాహనం కొన్నానని చెప్పాడు. దానిపై చలాన్లు పెండింగ్‌ ఉన్నట్లు తెలియదన్నారు. చలాన్లు చెల్లించడానికి తన దగ్గర అంత డబ్బు కూడా లేదని అస్లాం తెలిపారు. వాహనాన్ని విక్రయించినా రూ.15 వేలకు మించి రావని చెప్పడం గమనార్హం.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...