ePaper
More
    Homeక్రైంKurnool | పారాణి ఆరక ముందే భర్తను చంపేసిన యువతి

    Kurnool | పారాణి ఆరక ముందే భర్తను చంపేసిన యువతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kurnool | వివాహేతర సంబంధాలు సమాజంలో అనేక నేరాలకు కారణం అవుతున్నాయి. ఇటీవల రాజారఘువంశీ (Raja Raghuvamshi) హనీమూన్​ హత్య (Honeymoon Murder) ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కర్నూలు (Kurnool) జిల్లా పిన్నాపురంలో ఓ యువతి తన తల్లి, మరో వ్యక్తితో కలిసి కట్టుకున్న వాడిని హత్య చేసింది. వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

    తెలంగాణలోని గద్వాల (Gadwal)కు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్​కు పిన్నాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్యతో వివాహమైంది. అయితే భార్య ఐశ్వర్య, ఆమె తల్లి, ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ కలిసి తేజేశ్వర్​ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బ్యాంక్ మేనేజర్, ఐశ్వర్య ఫోన్లను ట్రేస్ చేసి వివరాలు సేకరించారు. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్ కోసం గాలిస్తున్నారు.

    కాగా.. ఇటీవల మధ్యప్రదేశ్​కు చెందిన జంట మేఘాలయకు హానీమూన్​కు వెళ్లగా భర్తను భర్య చంపించిన విషయం తెలిసిందే. సోనమ్​ అనే మహిళా తన భర్త రాజారఘువంశీని ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెతో పాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే మరో యువతి తన భర్తను చంపించడం గమనార్హం.

    More like this

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...