ePaper
More
    Homeఅంతర్జాతీయంIran - Israel | ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్‌ దాడులు

    Iran – Israel | ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్‌ దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran – Israel | ఇరాన్​ – ఇజ్రాయెల్ (Iran – Israel)​ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్​లోని అణు స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో పశ్చిమాసియాలో తీవ్ర అలజడి నెలకొంది. ఇన్ని రోజులు ఇజ్రాయెల్​– ఇరాన్​ దాడులు చేసుకుంటుండగా శనివారం రాత్రి అమెరికా (America) ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​లోని అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్​పై ఆదివారం ఉదయం డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

    ఇరాన్​పై అమెరికా దాడులతో ముందుగానే ఇజ్రాయెల్​ అప్రమత్తమైంది. తమ భూభాగంపై టెహ్రాన్ (Tehran)​ దాడులకు దిగుతుందని భావించి హై అలర్ట్​ ప్రకటించింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. సభలు, సమావేశాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) నిషేధించాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్​ ఊహించినట్లుగానే ఇరాన్​ ప్రతిదాడులకు దిగింది. భారీ సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో టెల్​ అవీవ్​పై విరుచుకుపడింది. రెండు ఇరాన్‌ డ్రోన్లు ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. దాడులతో టెల్‌ అవీవ్‌ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు తలదాచుకుంటున్నారు.

    కాగా.. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్​లోని పలు అణుస్థావరాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇరాన్​లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భూగర్భంలో ఉన్న ఫోర్డో అణు శుద్ధి కేంద్రాన్ని తాము పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump)​ ప్రకటించారు. దానిపై ఆరు బంకర్​ బస్టర్​ బాంబులను ప్రయోగించామని తెలిపారు. భూగర్భంలోకి చొచ్చుకుని వెళ్లి విధ్వంసం సృష్టించడం బంకర్​ బస్టర్​ బాంబుల ప్రత్యేకత. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్​ ఇజ్రాయెల్​పై ప్రతిదాడులకు దిగింది. అయితే అమెరికాపై ఎలా స్పందిస్తుందనే విషయం చూడాలి.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...