ePaper
More
    Homeక్రైంZepto delivery boy | సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిపై డెలివరీబాయ్​ అత్యాచారయత్నం

    Zepto delivery boy | సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిపై డెలివరీబాయ్​ అత్యాచారయత్నం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Zepto delivery boy | చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగినిపై క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో (Zepto Delivery Boy) డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.

    చెన్నై (Chennai)లోని కుబేరన్ నగర్ (Kuberan nagar) ప్రాంతంలో నివసిస్తున్న మహిళా ఐటీ కంపెనీలో పని చేస్తోంది. ఆమె జెప్టో యాప్ ద్వారా కిరాణా సామగ్రి (Grocery) ఆర్డర్​ చేసింది. దీంతో గోపినాథ్​ అనే డెలివరీ బాయ్ ఆ వస్తువులను డెలివరీ చేశాడు. అనంతరం ఫోన్​లో ఛార్జింగ్​ లేదని, కొద్దిసేపు పెట్టుకుంటానని ఆమెను కోరాడు. దీంతో డెలివరీ బాయ్​ను ఆమె ఇంట్లోకి రానిచ్చింది.

    ఛార్జింగ్​ పెట్టుకున్న గోపినాథ్​ ఇంట్లో ఎవరు లేకపోవడంతో సదరు మహిళపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా గోపినాథ్​ను అరెస్ట్​ చేశారు. కాగా ఈ విషయమై జెప్టోకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని స్థానికులు తెలిపారు. దీంతో జెప్టో కంపెనీ తీరుపై నెటిజెన్లు మండిపడుతున్నారు.

    More like this

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...