ePaper
More
    Homeఅంతర్జాతీయంTrump warn | ఇరాన్​కు ట్రంప్​ మరో స్ట్రాంగ్​ వార్నింగ్​.. ఏమన్నారంటే..

    Trump warn | ఇరాన్​కు ట్రంప్​ మరో స్ట్రాంగ్​ వార్నింగ్​.. ఏమన్నారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump warn : అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడికి ఇరాన్‌ తిరిగి కౌంటర్‌ ఇవ్వడంతో.. అమెరికానే నేరుగా రంగంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై శనివారం రాత్రి యూఎస్​ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడి తర్వాత అగ్రరాజ్యం యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (US President Donald Trump) కీలక అంశాలను ప్రకటించారు.

    అమెరికా(America)లోని వైట్‌ హౌజ్‌(White House)లో ఆదివారం ఉదయం మీడియాతో ట్రంప్‌ మాట్లాడారు. ఇరాన్‌ కచ్చితంగా శాంతికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించారు. “ఇరాన్‌పై విజయవంతంగా దాడి పూర్తి చేశాం. ప్రపంచంలో మరే సైన్యం ఇలా దాడి చేయలేదు. ఇది మన సైనిక విజయం. ఇరాన్ కచ్చితంగా శాంతి చర్చలకు రావాలి. లేదంటే భవిష్యత్తులో మరింత తీవ్రమైన దాడులు చేపడతాం. మరింత కచ్చితత్వం, వేగం, నైపుణ్యంతో దాడులు నిర్వహిస్తాం. మేము దాడులు చేయాల్సిన లక్ష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. తాజా దాడుల సందర్భంగా ఇజ్రాయెల్‌కు కృతజ్ఞతలు” అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

    Trump warn : ఇరాన్​ రియాక్షన్​ ఏమిటి..?

    అమెరికా తమపై దాడి చేస్తే.. తిరిగి దాడి చేస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైనిక స్థావరాలపై కచ్చితంగా ఇరాన్‌ ప్రతి దాడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనికితోడు ఇరాన్‌పై అమెరికా దాడికి పాల్పడితే.. చైనా CHINA, రష్యా Russia నుంచి ఇరాన్‌కు మద్దతు లభించే అవకాశం ఉందనే బలమైన వాదన ప్రచారంలో ఉంది. మరి తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా, చైనా నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే.. పరిస్థితి చేయి దాటిపోయి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు.

    ఇరాన్‌ అణు స్థావరాలపై దాడి తర్వాత అమెరికా అప్రమత్తం అయింది. అంతర్గతంగా భద్రతా బలగాలను అలెర్ట్​ చేసింది. భద్రతా సంస్థలు ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. న్యూయార్క్‌ New York లోని మత, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు పెంచింది.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...