India - England Match
ENG vs IND Match | ఉత్కంఠ‌గా మారిన తొలి టెస్ట్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India – England Match : ప్ర‌స్తుతం భార‌త్, ఇంగ్లండ్ England జట్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర ఫైట్ న‌డుస్తోంది. నువ్వా, నేనా అంటూ రెండు టీంలు పోటీ ప‌డుతున్నాయి.

లీడ్స్(Leeds) వేదికగా జరుగుతున్న తాజా టెస్ట్​ మ్యాచ్‌లో బుమ్రా ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. అతని బౌలింగ్‌లో రెండు సునాయస క్యాచ్‌లను జడేజా, యశస్వి జైస్వాల్‌ వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌కు తడబడిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. మిగతా బౌలర్లను అవలీలగా ఆడేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

అంతకుముందు 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్​ అయింది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

India – England Match : పోటాపోటీగా..

ఇక ఇంగ్లండ్ బ్యాట‌ర్స్‌లో క్రాలీ (4), డ‌కెట్ (62), పోప్(100 నాటౌట్‌), రూట్‌(28), బ్రూక్ (0 నాటౌట్‌) ప‌రుగులు చేయ‌గా.. ఇంగ్లండ్ జ‌ట్టు రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జడేజా వదిలేశాడు. బుమ్రా వేసిన ఏడో ఓవర్‌లో ఈ ఘటన చేసుకుంది. ఈ ఓవర్‌ చివరి బంతి డకెట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బ్యాక్‌వార్డ్ పాయింట్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా Jadeja క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. నేరుగా జడేజా చేతుల్లో పడి బంతి చేజారింది.

ఈ క్యాచ్ పట్టి ఉంటే బెన్ డకెట్ 15 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 68 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఓలిపోప్‌తో కలిసి రెండో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. జడేజా ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇంగ్లండ్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయేది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (jusprit Bumrah) చరిత్ర సృష్టించాడు. సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) (South Africa, England, New Zealand, Australia) దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్‌లను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.