ePaper
More
    HomeజాతీయంGST refund scam | భారీ కుంభకోణం.. రూ.100 కోట్ల నకిలీ GST రీఫండ్ స్కామ్‌.....

    GST refund scam | భారీ కుంభకోణం.. రూ.100 కోట్ల నకిలీ GST రీఫండ్ స్కామ్‌.. పలు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST refund scam | నకిలీ ఎగుమతి బిల్లుల ద్వారా సుమారు రూ.100 కోట్ల విలువైన బోగస్ GST రీఫండ్ క్లెయిమ్‌లకు సంబంధించిన కేసులో సీబీఐ (Central Bureau of Investigation – CBI) పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. బీహార్(Bihar), జార్ఖండ్‌(Jharkhand)లోని పాట్నా(Patna), పూర్నియా(Purnia), జంషెడ్‌పూర్(Jamshedpur), నలంద(Nalanda), ముంగేర్‌(Munger)లతో సహా ఏడు ప్రదేశాలలో సీబీఐ సోదాలు చేపట్టింది.

    ఈ కుంభకోణంలో అప్పటి అదనపు కమిషనర్, పాట్నా, రణ్‌విజయ్ కుమార్‌తో పాటు మరో నలుగురు మాజీ సూపరింటెండెంట్​లు ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్​లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పన్ను రీఫండ్‌లను మోసపూరితంగా క్లెయిమ్ చేయడానికి వారు ఒక ప్రైవేట్ G-కార్డ్ హోల్డర్, బహుళ ఎగుమతిదారు, దిగుమతిదారు సంస్థలతోపాటు మరికొందరితో కుమ్మక్కయ్యారని CBI వెల్లడించింది.

    భీమ్‌నగర్(Bhimnagar), జయనగర్(Jayanagar), భిట్టమోర్‌(Bhittamore)లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు (Land Customs Stations – LCS) ద్వారా టైల్స్, ఆటోమొబైల్ విడిభాగాల నకిలీ ఎగుమతులను చూపించడానికి నిందితులు కుట్ర పన్నారని సీబీఐ గుర్తించింది. ఈ డాక్యుమెంటేషన్‌ను ఉపయోగించి అధికార పరిధిలోని GST కార్యాలయాల నుంచి GST వాపసులను మోసపూరితంగా పొందారని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది.

    సోదాల సమయంలో, సీబీఐ అధికారులు 100 గ్రాముల బరువుగల 7 బంగారు కడ్డీలు, అనేక నేరారోపణ పత్రాలు, కేసుకు సంబంధించిన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నేరపూరిత కుట్ర, అవినీతికి సంబంధించిన సెక్షన్​ల కింద నిందితులపై CBI కేసు నమోదు చేసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...