ePaper
More
    HomeFeaturesJune 21 | ఖగోళంలో అద్భుతం.. ఈ రోజు రాత్రి తక్కువ ఎందుకో తెలుసా..?

    June 21 | ఖగోళంలో అద్భుతం.. ఈ రోజు రాత్రి తక్కువ ఎందుకో తెలుసా..?

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 21 : సంవత్సరంలో 365 రోజులు, లీపు సంవత్సరం అయితే 366 రోజులుంటాయి. ప్రతిరోజూ 24 గంటలు కాగా, ఏడాదిలో నాలుగు రోజులు ప్రత్యేకమైనవి. అవి మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 23 మరియు డిసెంబర్ 22.

    అయితే ఈ రోజు అతిపెద్ద పగటి రోజు (జూన్ 21). ఈ రోజు పగలు సమయం Morning time ఎక్కువ ఉండగా, రాత్రి తక్కువగా ఉంది. దాంతో అతిపెద్ద పగటి సమయం ఉన్న రోజుగా జూన్ 21ని నిలిచింది. మాములుగా అయితే పగటి సమయం 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే జూన్‌ 21వ తేదీన కనీసం 13 గంటల 7 నిమిషాల సుదీర్ఘమైన పగటి సమయం ఉంది. ఈరోజు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖకి లంబంగా వచ్చాడు. అందువల్ల మధ్యాహ్నం కొంతసేపు మన నీడ కూడా ఏర్పడలేదు.. అని శాస్త్రవేత్తలు తెలిపారు.

    June 21 : ఖగోళంలో అద్భుతం..

    జూన్ 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలు కాగా, సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం ఉంది. దక్షిణాది అర్థగోళంలో ఉండే బ్రిటన్, అమెరికా, రష్యా, కెనడా, భారత్, చైనా వారికి నేటితో వేసవి కాలం ముగుస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా Australia, అర్జెంటీనాArgentina, చిలీ Chile, న్యూజిలాండ్‌ New Zealand వంటి దేశాల్లో శీతాకాలం ప్రారంభమవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    వేసవి అయనాంతం అనేది భూమి కక్ష్యలో సూర్యుడు ఉత్తర అర్ధగోళంలో ఆకాశంలో అత్యున్నత స్థానంలో కనిపించే బిందువు. అంద వ‌ల‌న ప్రతి సంవత్సరం జూన్ 20-22 మధ్య వస్తుంది. “అయనాంతం” అనే పదం లాటిన్ నుండి రాగా, సోల్ అంటే సూర్యుడు, సిస్టెర్ అంటే నిశ్చలంగా నిలబడటం. ఆకాశంలో దిశను మార్చుకునే ముందు సూర్యుడు స్పష్టంగా విరామాన్ని సూచిస్తుంది.

    సుదీర్ఘ రాత్రి లేదా పగలు ఉన్న రోజులను సోల్​స్టీస్​ అంటారు. ఏటా జూన్​ 21న, డిసెంబరు 21న.. రెండు సందర్భాల్లో ఈ సోల్​స్టీస్​ ఏర్పడుతుంది. లాటిన్​ భాషలోని సోల్​, సిస్​టెరీ అనే పదాల నుంచి ఈ సోల్​స్టీస్​ వచ్చింది. జూన్​లో వచ్చే దానిని సమ్మర్​ సోల్ట్​స్టిస్​, డిసెంబర్​లో ఏర్పడే దానిని వింటర్ ​సోల్ట్​స్టీస్​గా పేర్కొంటారు.

    ఇక డిసెంబ‌ర్ 21కి ప్రత్యేకత ఉంది. అదేంంటో తెలుసా? ఇది సంవత్సరంలో అత్యంత చిన్న రోజు. సూర్యుడు ఉదయం 7.10 గంటల నుంచి సాయంత్రం 5.29 గంటల మధ్యే ఉంటాడు. అయితే సాధారణంగా భారత్ లో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. దోంగ్ గ్రామంలో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. అయితే ఈ 21న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది. ఏపీలోని గుడివాడలోనూ అదే సమయంలో సూర్యుడు ఉదయించనున్నాడని శాస్త్రవేత్తలు గతంలో తెలిపారు. కొన్నిచోట్ల సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. డిసెంబర్ 22వ తేదీన లాంగెస్ట్ నైట్ డే ఏర్పడుతుంది.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...