ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నెలరోజుల్లోగా నగర జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు

    Nizamabad City | నెలరోజుల్లోగా నగర జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగర జర్నలిస్టులకు నెలరోజుల్లోగా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ (PCC Chief)​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) హామీ ఇచ్చారు.

    జర్నలిస్టులకు ఇళ్లస్థలాల సాధన నిమిత్తం జర్నలిస్టులు హైదరాబాద్​ తరలివెళ్లారు. గాంధీభవన్​లో (Gandhi Bhavan) పీసీసీ చీఫ్​ను కలిసి సమస్యను విన్నవించారు. నివాసయోగ్యం కాని గుండారం (Gundaram) గుట్టల్లో కాకుండా నగరానికి సమీపంలో జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం షబ్బీర్​అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారిరువురు సానుకూలంగా స్పందించారని.. విలేకరులకు నివాసయోగ్యమైన స్థలాలను పరిశీలించి ఇవ్వాలని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) ఆదేశించారని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని.. బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, షబ్బీర్​అలీ హామీ ఇచ్చారని వారు స్పష్టం చేశారు.

    ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీని కలిసిన నగర జర్నలిస్టులు

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...