ePaper
More
    HomeజాతీయంIndigo Flight | విమానంలో ఇంధన కొరత.. తప్పిన ప్రమాదం

    Indigo Flight | విమానంలో ఇంధన కొరత.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indigo Flight | అహ్మదాబాద్​లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన తర్వాత కూడా ఎయిర్​లైన్​ సంస్థలు జాగ్రత్తలు పాటించడం లేదు. దీంతో వరుసగా జరుగుతున్న పలు ఘటనలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి.

    ఇటీవల అహ్మదాబాద్​లో ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయి 270కి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయినా కూడా విమాన సంస్థలు (Airlines) కళ్లు తెరవడం లేదు. ఇటీవల పలు ఎయిర్​ ఇండియా (Air India) విమానాలు రన్​వేపైకి వచ్చాక సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇండిగో విమానం (Indigo Flight) గాలిలో ఉండగానే.. ఇంధనం అయిపోవడానికి వచ్చింది. దీంతో ఫైలెట్​ ఎమెర్జెన్సీ ల్యాండింగ్​ చేశాడు.

    Indigo Flight | ఇంధనం లేకపోవడంతో..

    గౌహతీ నుంచి ఇండిగో విమానం శనివారం చెన్నై బయలుదేరింది. గాలిలో ఉండగానే విమానంలో ఇంధన కొరత నెలకొంది. దీంతో అప్రమత్తమైన పైలెట్​ మే డే కాల్ ​ఇచ్చారు. అనంతరం విమానాన్ని అత్యవసరంగా బెంగళూరు (Bengaluru airport)లో ల్యాండ్​ చేశారు. విమానం సేఫ్​గా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం సాంకేతిక సమస్యల పేరుతో పలు విమానాలను నిలిపివేస్తున్నారు. దీంతో విమానం ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...