అక్షరటుడే ఇందల్వాయి: Forest Department | అటవీ భూమిని చదును చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకువ వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి అటవీరేంజ్ (Indalwai Forest Range) పరిధిలోని కొట్టాలపల్లి బీట్ కంపార్ట్మెంట్ 593లో అటవీ భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు.
భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా తండావాసి భూక్యా నవీన్, మరికొందరు కలిసి అటవీ అధికారులపై కారం చల్లారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ అధికారులు ప్రవీణ్, రాములు, ఖదీర్, బేస్ క్యాంపు సిబ్బందిపై దాడి చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్పల్లి పోలీసులు (Dharpally Police station) ట్రాక్టర్ను సీజ్ చేసి దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో రవిమోహన్ భట్ పేర్కొన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసులు సీజ్ చేసిన ట్రాక్టర్